అత్యాచారం, హత్య చేసిన నిందితున్ని బహిరంగంగా శిక్షించాలి: పీక కిరణ్

– బాలిక కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్ గ్రేషియో చెల్లించాలి.
నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ లో బాలికపై అత్యాచారం చేసి,హత్యకు పాల్పడిన నిందితున్ని బహిరంగంగా శిక్షించాలని ఉత్తర తెలంగాణ మాలమహానాడు అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు.మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులలో తక్కువ వేతనాలకు ఇతర రాష్ట్రాల్లో ఉండే కార్మికులను తీసుకొచ్చి ఏలాంటి నిబంధనలు పాటించకుండా పరిచయం చేసుకుంటున్నా యాజమాన్యాలు అక్కడ ఏం జరిగినా పట్టించుకోని అధికారులు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఘటన జరుగుతున్న కఠినమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. గత సంవత్సరం ఇటిక బట్టీలలో బాలిక పైన ఇదే రకమైన దుశ్చర్య జరిగిందని, అయినా అధికారులు పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు  తీసుకోకపోవడంతో నేరస్థులకు భయం లేకుండా పోతుందన్నారు. ఇతర రాష్టాల నుండి కార్మికులను తీసుకువచ్చినప్పుడు వారికి సంబంధించిన వివరాలు సంబంధించిన అధికారుల వద్ద పోలీస్ సిబ్బంది వద్ద లేకపోవడం కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయన్నారు. యాజమాన్యాల పైన నిందితులపైన వెంటనే కేసు పెట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుల్తానాబాద్ మండలంలో కాట్నపల్లి బాలికను అత్యాచారం చేసి , హత్య చేసిన నిందితుణ్ణి ఫోక్సో చట్టం ప్రకారం శిక్షించి వారి కుటుంబానికి రూ.50లక్షల ఎక్ష్ గ్రేషియో చెల్లించి ఆదుకోవాలని రైస్ మిల్లు యాజమాన్యాల పైన కూడా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు .
Spread the love