నెల్లూరు సెంట్రల్ జైలుకు పిన్నెల్లి

నవతెలంగాణ – హైదరాబాద్ : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో వాదనలు విన్నారు న్యాయమూర్తి.  ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టి , దాడి చే సిన నాలుగు కేసుల్లో విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మె ల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు అయింది. కానీ… మరో రెండు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అనంతరం మాజీ ఎమ్మెల్యే వై కాపా నేత పిన్నెల్లి ని నెల్లూరు జైలుకు తరలించాలని ఆదేశించారు. కాగా, నిన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Spread the love