పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన వారికి స్థలాలు చూపించాలి

– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు డి.రామ్‌చందర్‌
– ఆర్డీవోకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-కందుకూరు
కందుకూరు మండలంలోని 788 సర్వేనెంబర్‌లో పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన నిరుపేదలకు స్థలాలు చూపించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు డి. రామ్‌చందర్‌ ఆధ్వ ర్యంలో బుధవారం ఆర్డీవో సూరజ్‌కుమార్‌కు వినతిప్రతం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007 సంవత్సరంలో నిరుపేదలకు 60 గజాల చొప్పున ఇండ్ల స్థలాలకు సర్టిఫికెట్లు అందజేసినట్టు గుర్తుచేశారు. ఆ స్థలాలు తమకు చూపించాలని 2022లో గుడిసెలు వేస్తే కూల్చి వేశారని వాపోయారు. నిల్వ నీడ లేక నిరుపేదలు అల్లాడుతున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు. సొంత ఇండ్లు లేక అద్దె ఇండ్లలో నివాసముంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, నిరుపేదలకు ఇండ్ల స్థలాలు చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి డి.శ్రీనివాస్‌, సీఐటీయూ మండల కన్వీనర్‌ బుట్టి బాలరాజు, మండల కమిటీ సభ్యులు ఎ.కుమార్‌, నాయకులు సత్తయ్య, కుమార్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love