Sunday, May 31, 2026
E-PAPER
Homeబీజినెస్హైదరాబాద్‌లో రూ.52 కోట్లతో ప్లాంట్

హైదరాబాద్‌లో రూ.52 కోట్లతో ప్లాంట్

- Advertisement -

క్క్యూ4లో రూ.10 కోట్ల లాభాలు
డిజిలాజిక్ సిస్టమ్స్‌ వెల్లడి ‌హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టెస్ట్, సిమ్యులేషన్స్ సొల్యూషన్స్ సంస్థ డిజిలాజిక్ సిస్టమ్స్ లిమిటెడ్.. మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.78.27 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.10.43 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఆదాయం 8.4 శాతం (రూ.72.19 కోట్లు) వృద్ధి చెందగా లాభం 33.8 శాతం (రూ.7.79 కోట్లు) పెరిగింది. ఈ ఏడాది జనవరిలో కంపెనీ బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ విభాగంలో లిస్టయింది. ఈ ఐపీఓ ద్వారా డిజిలాజిక్ రూ.69.66 కోట్లు సమీకరించింది. గడచిన ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కంపెనీ రుణ భారం రూ.13.34 కోట్ల నుంచి రూ.4.06 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. కాగా హైదరాబాద్ హార్డ్‌వేర్ పార్క్ ఫేజ్ 2లో ఈఎంఎస్ మాన్యుఫ్యాక్చరింగ్, ఈఎస్‌ఎస్ స్క్రీనింగ్ సహా సామర్థ్య విస్తరణ కోసం రూ.51.74 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్ట్ ఉదాన్ పేరుతో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు డిజిలాజిక్ వెల్లడించింది. 2027 మే నాటికి ఈ ప్లాంట్ అందుబాటులోకి రానుంది. అలాగే రక్షణ, ఏరోస్పేస్ రంగం కోసం అభేద్య సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ ఆర్డర్ బుక్ రూ.31 కోట్లుగా ఉంది. మరో రూ.110 కోట్ల ఆర్డర్లకు సంబంధించి టెండర్లు దాఖలు చేసినట్లు డిజిలాజిక్ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -