క్యూ4లో రూ.2,537 కోట్ల నష్టాలు
బెంగళూరు : బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఇండిగో భారీ నష్టాలను చవి చూసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ. 2,537 కోట్ల భారీ నికర నష్టాన్ని నమోదు చేసింది. 2024-25 ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.3,067.50 కోట్ల లాభాన్ని ఆర్జించడం గమనార్హం. క్రితం క్యూ4 ఆదాయం 3 శాతం పెరిగి రూ. 23,830.70 కోట్లకు చేరినప్పటికీ నష్టాలు తప్పలేదు. అలాగే.. 2025-26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ మొత్తం రూ.2,393.60 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంతకుముందు 2024-25 నమోదైన రూ. 7,502.50 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది భారీ క్షీణత. మరోవైపు వార్షిక ఆదాయం మాత్రం 6.4 శాతం వృద్ధితో రూ.89,513.40 కోట్లకు చేరింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల 2025-26లో సంస్థకు విదేశీ మారకపు ద్రవ్యం రూపంలో రూ. 8,100 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. దీనికి తోడు 2025 డిసెంబరులో విమాన సర్వీసుల్లో ఏర్పడిన భారీ అంతరాయాల వల్ల మరో రూ. 580 కోట్ల ప్రభావం పడింది. గత ఆర్థిక సంవత్సరం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని.. ఈ పరిణామాలే సంస్థ లాభదాయకతను దెబ్బతీశాయని ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తెలిపారు.
ఇండిగోకు చమురు, రూపాయి దెబ్బ..
- Advertisement -
- Advertisement -



