– ఎంపీడీఓ ఫారూఖ్ హుసేన్
– శంకర్ కొండ గ్రామ పంచాయతీలో పర్యటించిన ఎంపీడీఓ
నవతెలంగాణ-ఆమనగల్
హరిత హారం కోసం మొక్కలు సిద్ధం చేయాలని ఎంపీడీఓ ఫారూఖ్ హుసేన్ సూచించారు. బుధవారం ఎంపీఓ శ్రీలత, ఏపీఓ మాధవరెడ్డి తదితరులతో కలిసి శంకర్ కొండ గ్రామ పంచాయతీలో ఎంపీడీఓ ఫారూఖ్ హుసేన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నర్సరీని సందర్శించి మొక్కలను పరిశీలించారు. రాబోయే హరిత హారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని సర్పంచ్‌తో పాటు పంచాయతీ సిబ్బందికి పలు సలహాలు సూచనలు తెలిపారు. అనంతరం గ్రామం శివారులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ పరిశీలించి కూలీలకు పలు సలహాలు సూచనలు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో పారిశుధ్య పనులను, పంచాయతీ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వారాంతపు సమీక్ష సమావేశంలో పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు పలు సలహాలు సూచనలు తెలిపారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు, మొక్కల పెంపకంతో పాటు ఉపాధి కూలీల సంఖ్యను పేంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ శ్రీలత, ఏపీఓ మాధవరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు, ఆయా గ్రామాల కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.