Sunday, June 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్లాస్టిక్ నిషేధిత గ్రామం తుక్కోజువాడి 

ప్లాస్టిక్ నిషేధిత గ్రామం తుక్కోజువాడి 

- Advertisement -

నవతెలంగాణ-సదాశివ నగర్
మండలంలోని తుక్కో జివాడి గ్రామంలో సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 గ్రామసభ నిర్వహించారు. గ్రామాన్ని ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంగారావు మాట్లాడుతూ మా గ్రామాన్ని ప్లాస్టిక్ నిషేధిత గ్రామంగా నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గ్రామంలో ఎవరైనా ఒక కిలో ప్లాస్టిక్ తీసుకువస్తే వారికి టిఫిన్ బాక్స్ అందిస్తామని నిర్ణయించుకున్నారు.  కలుషితం లేని నీటిని ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. దోమలకు నివారణకు బాల్స్ కూడా తయారుగా ఉన్నాయని తెలిపారు. మా గ్రామంలో దోమల నివారణకు పాగింగ్ మిషన్ ని ఉన్నదని తెలిపారు. వేసవికాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచినీటిని సరఫరా చేసినట్టు తెలిపారు. గ్రామ సభలో గ్రామ సమస్యల గురించి మాట్లాడినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజయ్య వార్డు మెంబర్లు ఇరిగేషన్ ఏ ఈ జావిద్ కార్యదర్శి రాజ్యలక్ష్మి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -