కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై బుధవారం స్థానిక పోలీసులు దాడి చేశారు. ఎస్ఐ టీ.యయాతి రాజు కథనం ప్రకారం మండల పరిధిలోని కొత్త గంగారం శివారులో కోడి పందేలు నిర్వహిస్తుండగా సమాచారం మేరకు దాడి చేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా పట్టుబడిన వారి వద్ద నుంచి 6 కోడి పుంజు లు, 7 ద్విచక్రవాహనాలు తో పాటు రూ.12 వేలు నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.