అకస్మాత్తుగా విత్తన దుకాణాలను తనిఖీ చేసిన పోలీస్ అధికారులు

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలోని విత్తన డీలర్స్ షాప్ లను గాంధారి మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తో, గాంధారి మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్ లు అకస్మాత్ గా ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం గాంధారి, శ్రీరామకృష్ణ ట్రేడింగ్ కంపెనీ , శ్రీ బాలాజీ ట్రేడర్స్ లను తనికి చెయ్యటం జరిగింది. ఈ తనికి లో  స్టాక్ రిజిస్టర్ లు, బిల్ బుక్స్, స్టాక్ బోర్డు , ధరల పట్టిక , వివిధ విత్తన కంపెనీ ల ఇన్వాయిస్ లు చెక్ చేయటం జరిగింది. అదే విధంగా రైతులకు బిల్ ఖచ్చితంగా ఇవ్వాలి అని, కాలం చెల్లిన విత్తనాలు అమ్మిన, లూజు విత్తనాలు అమ్మిన, అధిక ధరలకు అమ్మిన విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకొవడం జరుగుతుంది దుకాణదారులకు సూచించారు అదే విధంగా విత్తనాలు అమ్మిన ప్రతి రైతు వివరాలు రిజిస్టర్ లో నమోదు చెయ్యాలీ అని అధికారులు సూచించారు.
Spread the love