రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల  నియమావళి ని పాటించాలి

– జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావు సూర్య వంశీ  
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ :లోక సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మానిక్ రావు సూర్య వంశీ కోరారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీలో ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.లోకసభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా అన్ని పార్టీలకు అందిందా? ఏవైనా సమస్యలు ఉన్నాయా? ఎన్నికల ప్రవర్తనా నియమాలని పాటిస్తున్నారా?  అని అడిగారు. ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరిగినట్లయితే తక్షణమే తమ దృష్టికి తీసుకువస్తే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈవీఎం ద్వారా పోలింగ్ రోజు నిర్వహించే మాక్ పోల్ విషయం ముందే తెలియజేశారా అని  అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, సి- విజిల్ ఆప్, సువిధ తదితర అంశాల గురించి ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో అడిగి తెలుసుకున్నారు.  ఎన్నికల వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్ మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థులు, పార్టీలు వారికి సంబంధించిన ఎన్నికల  ఖర్చుల నిర్వహణను పక్కగా నిర్వహించాలని, రిజిస్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని అన్నారు.    ఈ సందర్భంగా పలువురు పార్టీ ప్రతినిధులు అన్ని అనుమతులను సింగిల్ విండో ద్వారా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.   ఎన్నికల పోలీసు పరిశీలకులు ఆమోఘ్ జీవన్ గాంకర్, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈ సమావేశానికి హాజరయ్యారు.
Spread the love