అక్రమ గంజాయి స్వాధీనం

నవతెలంగాణ-కాజీపేట
ఎక్సైజ్‌ పోలీసుల తనిఖీలలో ఐదు కిలోల గంజా యి స్వాధీనం చేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కాజీపేట ఎక్సైజ్‌ సీఐ చం ద్రమోహన్‌ మాట్లాడుతూ వరంగల్‌ డిప్యూటీ కమిషనర్‌ అంజన్‌ రావు, ఎక్సైజ్‌ సూపర్డెంట్‌ చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు శుక్రవారం కాజీపేట రైల్వే స్టేషన్‌ పరి ధిలో కాజీపేట ఎక్సైజ్‌ పోలీసులు విశ్వసనీయ సమా చారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా 5 కిలోల ఎం డు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎ న్నికల కోడ్‌ దృష్ట్యాఉంచుకొని కాజీపేట ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విస్తృత దాడులు నిర్వహించడం జరి గిందన్నారు. ఎన్నికల కోడ్‌లో ప్రతి ఒక్క అంశం మీద ఖచ్చితమైన నిఘ ఏర్పాటు చేశామని మత్తు పదార్థాలు , గంజాయి, అక్రమంగా మద్యం నిల్వ చేయడం, గు డుంబా అమ్మడం, రవాణా, డంపులు చేయడం పై పూ ర్తిగా దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ తనిఖీలలో ఎక్సైజ్‌ ఎస్సై తిరుపతి, సిబ్బంది వీ రమల్లు, వెంకట్‌ నా రాయణ, రవీందర్‌ తదితరులు పాల్గొన్నా రు.

Spread the love