టీపీటీఎఫ్  విద్యామహాసభల పోస్టర్ ఆవిష్కరణ

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఈ నెల 11, 12 తేదీలలో  ఖమ్మంలో నిర్వహించే టీపీటీఎఫ్  రాష్ట్ర మహాసభల పోస్టర్లను నిజాంబాద్ మండల కార్యాలయంలో  మండల విద్యాశాఖ అధికారి రామారావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వాసుదేవరావు, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగల్ల సురేష్  ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. 2 రోజులు జరిగే మహాసభలలో  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దాసరి అనసూయ సీతక్క, ఎంపీలు ఎమ్మెల్యేలు,ఈ సదస్సులోఅసమాన సమాజంలో సమానత్వ విద్య, సాధ్యాసాధ్యాలు, అంతరాలు లేని విద్య ప్రజలకు ప్రభుత్వ బాధ్యత, పాసింజం బుద్ధి జీవుల పాత్ర, మహిళల స్థితిగతులు కర్తవ్యాలు, ప్రభుత్వ విధానాలు ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ పరిస్థితులు ఫలితాల ప్రభావాలు, మొదలగు అంశాల పైన సదస్సులు చర్చాగోష్టులు ఉంటాయి. ఉపాధ్యాయ ఉద్యమాలు, ఉపాధ్యాయ హక్కుల సాధన, ప్రభుత్వ పాఠశాల బలోపేతం పైన, తీర్మానాలు ఉంటాయి. ప్రముఖ విద్యావేత్తలు ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ కోదండరాం, పద్మ, ప్రొఫెసర్ కాసిం ప్రొఫెసర్ ప్రసాద్,  విమలక్క, విద్యాశాఖ కార్యదర్శి వెంకటేశం డైరెక్టర్ దేవసేన ఇతర విద్యాశాఖ అధికారులు, సీనియర్ ఏ పి టి ఎఫ్, టి పి టి ఎఫ్ నాయకులు పాల్గొనున్నారు. ఈపోస్టర్ ఆవిష్కరణ లో టి పి టి ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు  అరవింద్ కార్యదర్శి మల్లేశం  గోపి లింబయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love