– బీఆర్‌ఎస్ చేవెళ్ల నియోజకవర్గం యూత్ మాజీ అధ్యక్షులు వనం లక్ష్మికాంత్‌రెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
పదవులు ముఖ్యం కాదు పార్టీ కోసమే పని చేస్తానని బీఆర్‌ఎస్ చేవెళ్ల నియోజకవర్గం యూత్ మాజీ అధ్యక్షులు వనం లక్ష్మికాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ళ నియోజకవర్గంలోనీ ఐదు మండలాల ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ యువ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజుల క్రితం తనకు ఎలాంటి సమాచారం లేకుండానే నియోజక వర్గ యూత్ ప్రెసిడెంట్ పదవిని తొలగించారని తెలిపారు. తన పదవిని ఎందుకు తొలగించారో మీడియా ద్వారా స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యను వివరణ వివ్వాలని కోరారు. నియోజకవర్గంలోని మండలాలకు సంబంధించిన కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటే బాగుందన్నారు. ఎమ్మెల్యే కంటే ముందు నుంచే తాను పార్టీలో పని చేస్తున్నానని వెల్లడించారు. పార్టీలో కష్టపడ్డ వారికి ఎమ్మెల్యే గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. తనకు పదవువలు ముఖ్య కాదనీ, పార్టీ మాత్రమే శాశ్వతమన్నారు. రెండు రోజుల క్రితం 111 జీఓ ను ఎత్తివేసిన సందర్భంగా ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే కాలె యాదయ్య, కొందరు నాయకులను మాత్రమే తీసుకువెళ్లి కలిశారు. కానీ తమ గ్రామాలు కూడా 111 జీఓ పరిధిలోనే ఉన్నా, సీఎంను కలిసేందుకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. 111 జీఓ కోసం మాజీ మంత్రి దివంగత ఇంద్రారెడ్డి పోరాటం చేయడం జరిగిందని గుర్తు చేశారు. కార్తీక్‌రెడ్డి కూడా సుప్రీం కోర్టులో ఫిటిషన్ వేసి డైరెక్షన్ తేవడం జరిగిందన్నారు. ఈ జీవోను ఎత్తివేయడంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి వర్యులు పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ రంజితరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం ఎంతో కృషి చేశారని చెప్పారు.ఇప్పటికైనా బీఆర్‌ఎస్ ఆదేశాల మేరకు, సీఎం కేసీఆర్, కేటీఆర్ ఆదేశానుసారం ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆధ్వర్యంలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు విక్రం, భాస్కర్, మైపాల్ రెడ్డి, రవీందర్, నర్సింలు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.