అధిక విద్యుత్ వినియోగం కారణంగా విద్యుత్ కొరత : విద్యుత్ ఏ ఈ సంకీర్త్

నవతెలంగాణ-భిక్కనూర్ : భిక్నూర్‌ మండలంలోని భగిర్థిపల్లి గ్రామంలో వ్యవసాయ బావులకు 3 ఫేస్ కరెంటు ఇవ్వాలని రైతులు గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు శనివారం ధర్నా నిర్వహించారు. 3 ఫేస్ కరెంటు లేని కారణంగా పొలాలకు నీరు అందించలేక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల పై ఏ.ఈ సంకీర్త్ వివరణ కోరగా జన్ కొ లో అధిక విద్యుత్ వినియోగం కారణంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 3 ఫేస్ కరెంట్ కొరత ఉందని త్వరలోనే సమస్య పరిష్కరించి రైతులకు 3 ఫేస్ కరెంటు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ అధికారులకు రైతులు సహకరించాలని కోరారు.

Spread the love