వీకేడీవీఎస్ రాజు కళాశాల ప్రభంజనం..

– ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్ధులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ఏకైక ప్రైవేట్ కళాశాల అయిన వీకేడీవీఎస్ రాజూ జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది.ఈ కళాశాల విద్యార్ధులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. తెలంగాణ విద్యాశాఖ బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ఈ జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయి మార్కుల తో పాటు అత్యధిక మార్కులు,ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ వెలుగోటి శేషుబాబు అభినందనలు తెలిపారు.
ప్రధమ సంవత్సరం:
మండలంలోని జమ్మి గూడెం కు చెందిన ఎంపీసీ విద్యార్ధిని లక్క దాసు సంధ్య  467/470 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. అశ్వారావుపేట కు చెందిన శీమకుర్తి అన్విత 466/470 మార్కులు పొంది స్టేట్ థర్డ్ ర్యాంక్ సాధించింది.
బై.పీ.లో..
అశ్వారావుపేట కు చెందిన బైపీసీ విద్యార్ధిని లొల్ల సుమశ్రీ 437/440 మార్కులు తెచ్చుకుని స్టేట్ సెకండ్ ర్యాంక్ పొందింది.
అశ్వారావుపేట కు చెందిన కోడూరి లక్ష్మి ప్రసన్న 433/440  మార్కులు సాధించింది. అశ్వారావుపేట కు చెందిన పమిడి వర్షిణి 430/440 మార్కులు సాధించింది.
సీఈసీ..
అశ్వారావుపేట విద్యార్ధిని మోర్తా జాహ్నవి 445/500 మార్కులు సాధించింది. అశ్వారావుపేట కు చెందిన మహబూబ్ రిహన్ 417/500 మార్కులు సాధించింది.
ద్వితీయ సంవత్సరం..
ఎంపీసీ లో…అశ్వారావుపేట కు చెందిన గుడి భవ్యశ్రీ  987/1000  మార్కులు సాధించింది. దమ్మపేట మండలం నాయుడు పేట కు చెందిన పాలోజు విజయలక్ష్మి 987/1000 మార్కులు సాధించింది. అశ్వారావుపేట మండలం జమ్మి గూడెం కు చెందిన లక్కదాసు స్వాతి 985/1000 మార్కులు పొందింది.
బైపీసీ లో..
అశ్వారావుపేట మండలం తిరుమలకుంట కు చెందిన అరిగెలా పవనిక కు 975/1000, దమ్మపేట మండలం మందలపల్లి కి చెందిన కాసగాని జీవన్మయి కి  972/1000 మార్కులు వచ్చాయి.
సీఈసీ లో..
వేదాంత పురం కు చెందిన ఉప్పాడ స్వాతి చందు కు 894/1000, కేసప్పగూడెం కు చెందిన  కొమ్మూరి శ్రీ ఆంజనేయ కు 889/1000,
అశ్వారావుపేట కు చెందిన జూజం పవన్ కు 888/1000 మార్కులు వచ్చాయి.
Spread the love