రాష్ట్రస్థాయి మార్కులతో మోడల్ స్కూల్ జక్రాన్ పల్లి ఇంటర్మీడియట్ ఫలితాలు

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
 బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ తెలంగాణా ఆదర్శ పాఠశాల& కళాశాల, జక్రాన్ పల్లి. మొదటి, రెండవ సంవత్సరం ఫలితాలలో,
 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 59 శాతం ఫలితాలు సాధించారు, అలాగే మొదటి సంవత్సరంలో  38 శాతం ఫలితాలు సాధించారని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్  రెండవ సంవత్సరంలో ఎంపీసీ విద్యార్థులు భానుమతి – 938/1000,
మనోఙ్ఞ – 934/1000 మార్కులతో,   బైపిసిలో ఇంద్రజ – 893/1000, వెన్నెల – 890/1000మార్కులతో, అలాగే సీఈసీ లో శ్రావణి – 923/1000, సంకీర్తన – 870/1000 మార్కులు  సాధించారు.
మొదటి సంవత్సరం ఎంపీసీలో అక్షయ – 449/470, నేహా – 447/470, వైష్ణవి – 445/470, గంగోత్రి – 440/470, రాఘవి -437/470 మార్కులతో, బైపిసిలో అను – 434/440, రోషిత, తేజస్విని – 417/440, సాయిలక్ష్మీ – 398/440 మార్కులతో,
సీఈసిలో డి. పల్లవి – 392/500, వెన్నెల – 375/500, రాష్ట్రస్థాయి మార్కులతో  ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను,  ఇందుకోసం కృషి చేసిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి గారు అభినందించారు.
Spread the love