Sunday, August 16, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసాగర్‌‌లో వియత్నాం బుద్ధ విగ్రహం ఏర్పాటుకు పరిశీలన

సాగర్‌‌లో వియత్నాం బుద్ధ విగ్రహం ఏర్పాటుకు పరిశీలన

- Advertisement -

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో
పాల్గొన్న ఆ దేశ ప్రతినిధులు

నవతెలంగాణ-నాగార్జునసాగర్
అంతర్జాతీయ ప్రమాణాలతో నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనంలో వియత్నాం దేశపు గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి శనివారం ఆ దేశ ప్రతినిధులు, ఇం‌జినీర్లు స్థల పరిశీలన చేశారు. గతంలో ఎన్నోసార్లు బుద్ధవనాన్ని సందర్శించిన వియత్నాం దేశ ప్రతినిధులు బుద్ధ వనంలో బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచారు. ఈ నేపథ్యంలో బుద్ధవనంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి పాల్గొన్న అనంతరం వారు బుద్ధుని విగ్రహ ఏర్పాటుకు అనుకూలమైన స్థలం కోసం పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. వియత్నాం దేశపు అమితాబ బుద్ధవిగ్రహాన్ని బుద్ధవనంలో ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరిచారని తెలిపారు. సుమారు 45 అడుగుల అమితాబ బుద్ధవిగ్రహాన్ని ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న డిజిటల్‌ ‌మ్యూజియం సమీపంలో ఏర్పాటు చేయడానికి వియత్నాం దేశ ప్రతినిధులు సంసిద్ధత తెలియజేశారన్నారు.

అందుకోసం బుద్ధవనం ప్రాజెక్ట్ తరపున ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుతున్నామని, అనుమతి రాగానే విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సాగర్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న బుద్ధవనం పరిధిలో ఆకర్షణీయమైన వియత్నాం బుద్ధవిగ్రహాన్ని ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ పర్యటనలో వియత్నాం దేశం ప్రతినిధులు గుయేన్, తీ కిమ్ లాంగ్ గుయేన్, నహుట్ మిన్హ్ ట్రాన్, కొ్క్ ఫామ్ ఫామ్, వాన్ హాయ్, గుయేన్ లే థాంహ్ తమ్, ఉంగ్ తన్ థే, ఫామ్ అన్హ్ డూయ్, గుయేన్ లే థాంహ్ గుయేన్ ఉన్నారు. అనంతరం వారు నాగార్జునకొండ మ్యూజియాన్ని సందర్శించారు. వీరితోపాటు బుద్ధవనం డీఈ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ నజీష్, ఆర్ అండ్ బీ డీఈ సతీష్, ఏఈ ప్రదీప్,ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర, బుద్ధవనం ఆర్ట్స్, ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్‌‌రావు, టూరిజం గైడ్ సత్యనారాయణ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -