– సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షుడు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్
నవతెలంగాణ- మల్హర్ రావు
రైతుకు రక్షణ కరువైపోయిందని,నేడూ శనివారం జాతీయ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షుడు చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో మాట్లాడారు భారత దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్,జై కిసాన్ అనే నినాదం ఇచ్చారని,అయితే వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉందన్నారు.స్వాతంత్రం వచ్చిన కొత్తలో దేశంలో 90 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. రానురాను వ్యవసాయ రంగం కుంటుపడుతుందన్నారు.పారిశ్రామి క, సేవా రంగాల అభివృద్ధితో వ్యవసాయానికి యువత క్రమేణా దూరమవుతుందన్నారు.వ్యవసాయ రంగంపై ఎక్కువగా బడుగు బలహీన వర్గాల వారు ఆధారపడి జీవిస్తున్నారని,.కాలంతో పాటు మార్పులు అవసరమే. కానీ వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవించేవారిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.రైతు కుటుంబము నుండి వచ్చి ప్రధాని పదవిని అలంకరించిన చరణసింగ్ జన్మదినమైన డిశంబరు 23 ని జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం గా(కిసాన్ దివస్ ) జరుపుకున్నట్టుకుగా తెలిపారు.నేలతల్లిని నమ్ముకొని, పలురకాల ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ, శ్రమించి పంటలను పండించిదేశ ఆర్ధికవ్యవస్థలో రైతులుకీలకపాత్ర పోషిస్తున్నట్లుగా తెలిపారు.ఒకప్పుడు అందరి వృత్తీ వ్యవసాయమే. కానీ, ఇప్పుడు పదిమందికీ అన్నం పెట్టే రైతన్నలు కరువైయ్యారన్నారు.దేశం ఎంత అభివృద్ధి చెందినా రైతుల కష్టాలు మాత్రం తగ్గడం లేదన్నారు.చౌదరి చరణ్ సింగ్ చేపట్టిన ఉద్యమాల ఫలితం గానే జమీందారీ చట్టం రద్దు అయింద, కౌలుదారీ చట్టం వచ్చిందని తెలిపారు. రైతులను వడ్డీవ్యాపారుల కబంధహస్తాలనుండి విడిపించి వారికి బ్యాంకు ఋణాలు అందించే విధానము ప్రవేశ పెట్టేలా చేయడం వెనుక చరణ్ సింగ్ నిర్వహించిన రైతు ఉద్యమాలున్నాయన్నారు. రైతుల గురించి , వ్యవసాయం గురించి అంతగా ఆలోచించి , వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన చరణ్ సింగ్ దేశ ప్రధాని అయినపుడు రైతాంగం ఆనంద పడిందని,.అయితే ఆయన పార్లమెంట్ లో ఎదుర్కోలేకపోయి తాత్కాలిక ప్రధానిగానే 1980 వ సంవత్సరము పదవి నుండి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు.. చరణ్ సింగ్ రైతునాయకుడిగానే 1987 మే 29 న మరణించారని తెలిపారు. రైతులకు ఆయనచేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని కిసాన్ దివస్ ” గా ప్రకటించిందని, ప్రభుత్వాలు కూడా వ్యవసాయ దారులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు.. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలని, నాణ్యమైన విత్తనాలు,ఎరువుల ధరలని తగ్గించాలని.భూసార పరీక్షలని ఉచితంగా నిర్వహించాలన్నారు.పంటలు పండించడానికి వారు పడే శ్రమకు గుర్తింపు లేక, చేసిన అప్పులు తీర్చలేక అత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నను కాపాడేందుకు వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి ఆదుకోవాలన్నారు..కరోనా కాలంలో వ్యవసాయ రంగమే దేశాన్ని ఆదుకుందనే విషయాన్ని పాలకులు గుర్తు ,పెట్టుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు