జాతీయ రహాదారి కింద భూములు కొల్పోతున్న రైతుల నిరసన

నవతెలంగాణ – ముత్తారం
జాతీయ రహాదారి ఎన్‌హెచ్‌ 163జి కింద భూములు కొల్పోతున్న ముత్తారం మండల కేంద్రంలోని రైతులు మంగళవారం నిరసనకు దిగారు. ముత్తారం గ్రామ శివారులో గల వ్యవసాయ భూముల రైతులతో ముత్తారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్‌డిఓ రైతులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారని, అనుకున్న సమయం కంటే ఒక గంట ముందు వచ్చి సమాఏశాన్ని ఏర్పాటు చేసి, రైతులతో కాకుండా అక్కడున్న ఇద్దరు ముగ్గురుతోనే సమావేశం నిర్వహించారని తెలిపారు. మిగతా రైతులు ముందు తెలిపిన సమాచారం ప్రకారం రైతులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరే సరికి అక్కడ ఉన్న వారితో ఫొటోలు తీసుకొని వెళ్లిపోతుంటే, అప్పుడే చేరుకున్న రైతులు సమావేశం అని తెలిపి, అసలు రైతులకు నష్టపరిహారంపై ఏమీ చెప్పడకుండా వెళ్లిపోతున్నారని నిలదీశారు. దీంతో ఆర్డీఓ తమ చేతుల్లో ఏమీ లేదని, అంతా చట్ట ప్రకారం జరుగుతుందని బదులిచ్చారని, గత సంవత్సరం ఇదే గ్రామ పంచాయతీలో జరిగిన సమావేశంలో ఆర్డీఓ సర్వేలో జరిగిన తప్పుల గురించి రైతుల నుంచి అర్జిలు తీసుకొని వాటిని ఇంత వరకు పరిష్కరించలేదని రైతులు మండిపడ్డారు. ఇప్పటి వరకు పలు మార్లు ఈ విషయంలో అర్జిలు ఇచ్చిన కూడా ఎలాంటి పరిష్కారం చూపకుండా ఇప్పుడు  రైతులతో సమావేశమని చెప్పి, అందరూ రైతులు రాక ముందే అక్కడున్న ఒకరిద్దరు రైతులతో ముందుగా సమావేశం ఏర్పాటు చేసి  తూతూ మంత్రంగా చేపట్టడం, దీనిపై ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్లి తేల్చుకోండని నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయంగా నష్టపరిహారం ఇచ్చేంత వరకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని కరాకండిగా చెప్పారు. కార్యక్రమంలో రైతులు పి.సుధాకర్‌ రెడ్డి, నూనేటి క్రిష్ణ, ఎం.లింగయ్య, ఎ.మధునయ్య, పి.కమల, తాటిపాముల శంకరయ్య, పి.శ్రీను, పి.వరారెడ్డి, ఎస్‌.రాజమల్లు, పింగిలి ప్రభార్‌ రెడ్డి, మందల శ్రీనివాస్‌, మందల సుగుణ, పందుల రాజు తదితరులున్నారు.
Spread the love