కుటుంబానికి ఆర్థిక సహకారం అందజేత..

– బాధిత కుటుంబాలకు పరామర్శ..
నవతెలంగాణ-డిచ్ పల్లి : ఇందల్ వాయి మండలంలోని పలు గ్రామాలలో మృతి చెందిన పలు కుటుంబ సభ్యులను సోమవారం  మాజీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ డాక్టర్ భూపతి రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. ఇందల్ వాయి మండలంలోని స్కూల్ తండా, గన్నారం, మేగ్య నాయక్ తండా, సిర్నాపల్లి, నల్లవెల్లి, గౌరారం, ఎల్లారెడ్డిపల్లి, కేకే తండా, గంగారాం తండా గ్రామ పంచాయతీ పరిధిలో గత కొన్ని రోజుల క్రితం హత్య చేసిన నబిసాబ్  నిరుపేద ముస్లిం కుటుంబానికి ఆర్థిక పరిస్థితి చూసి చలించి వేంటనే 5000 వేల  రూపాయల ఆర్థిక సహాయం ను అందజేశారు.హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.అంతకు ముందు పలు గ్రామాలలో వివిధ కారణాల వల్ల మృతి చెందిన, అనారోగ్యం బారిన పడిన పలు కుటుంబ లను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ఏళ్ళవెలల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి కుటుంబాలను నేనున్నా నంటు  పరిమర్శించి ఓదార్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలా అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, కిసాన్ కేత్ మండల అధ్యక్షుడు ఎల్ ఐ సి గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి , డిసిసి డెలిగేట్ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపిటిసి జంగిలి లక్ష్మీ తోపాటు  మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love