నవతెలంగాణ-ఆర్మూర్
పిఎస్ఎస్ఎమ్ నవనాథపురం వారి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం సిద్దుల గుట్ట యందు ధ్యాన, కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ పిరమిడ్ సొసైటీలో విశేషంగా కృషి చేస్తున్న 20 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా పిరమిడ్ వద్ద సన్మానించడం జరిగింది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే మరోవైపు ధ్యానం, శాఖాహారం, పిరమిడ్ కొరకు విశేషంగా కృషి చేస్తూ ప్రజలకు ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలను వివరిస్తూ వారు ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారందరినీ సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి నిజామాబాద్ ఆర్మూర్, మెట్పల్లి కి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూ పిరమిడ్ సొసైటీలో సేవలందిస్తున్న ఉపాధ్యాయులు పాల్గొని సన్మానాన్ని స్వీకరించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో 500 మంది పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ సభ్యులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, కూనింటిశేఖర్ రెడ్డి, నల్ల గంగారెడ్డి, అమరవాజ్ శ్రీనివాస్, పెంబర్తి నారాయణ, రాజారామ్, సతీష్ ప్రేమ్ కుమార్, నిశాంత్ పాల్గొన్నారు.