పార్టీలకు అతీతంగా ప్రజా పాలన

– విద్యాసంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి
– సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
నవతెలంగాణ యాదగిరిగుట్ట రూరల్: పార్టీలకు అతీతంగా ప్రజా పాలన అందిస్తామని, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యా సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి అని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చీర శ్రీశైలం అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా బీర్ల అయిలయ్య హారయ్యారు. వివిధ శాఖల పై చర్చలు జరిగిన అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యని ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో అన్ని శాఖలకు నిధులు కేటాయిస్తామని, పెండింగ్‌ పనులతో పాటు కొత్త పనులకు కూడా నిధులు మంజూరు చేయిస్తాను అన్నారు. 2006 నుండి 13 వరకు సర్పంచులకు గౌరవం ఉండేదని, 2014 తర్వాత సర్పంచులకు మర్యాద లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఇకపై జరగవన్నారు. పార్టీకలతీతంగా ప్రజాపాలన సాగుతుందని, ఆరు గ్యారంటీలు గడపగడపకు చేరేలా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రజాపాలన లో ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. గ్యారంటీలను ఇంప్లిమెంట్ చేస్తే భవిష్యత్తు బాగుంటదని, గత ప్రభుత్వం చేసిన తప్పులను చేయబోమన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో ఆలేరు అభివృద్ధి చేసుకుందాం అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, ఎంపీడీఓ ప్రభాకర్ రెడ్డి, సర్పంచులు భీమగాని రాములు, మొగిలిపాక తిరుమల రమేష్, తెల్జురి శ్రీశైలం, తోటకూర బీరయ్య, ఎంపీటీసీలు విజయ వీరయ్య, అరుణ, ఐలయ్య, పలు శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love