ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను అభ్యర్థులను సమస్యలపై నిలదీయండి..

– పౌర హక్కుల సంఘం నాయకుల పిలుపు..
నవతెలంగాణ – అచ్చంపేట: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం మన ఇంటికి వస్తున్న రాజకీయ పార్టీల నాయకులను ఎమ్మెల్యే అభ్యర్థులను సమస్యల పైన నిలదీయాలని పౌర హక్కుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు ఆదివారం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద సంబంధించిన కరపత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి జక్కా బాలయ్య , సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ మాట్లాడారు. ప్రజలకు నష్టం కలిగించే కంపెనీలు నిర్మాణం చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నారని సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని అన్నారు. ఉచిత ఆమెలు ప్రకటిస్తున్నారు కానీ ప్రజాస్వామ్యపదంగా పాలన చేస్తామని ఏ పార్టీ నాయకుడు ప్రచారం చేయడం లేదని అన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పౌర హక్కు సంఘం నాయకులు ప్రశ్నిస్తున్న సందర్భంలో అదేవిధంగా జర్నలిస్టులు పైన అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. నల్లమల్ల ప్రాంత ఆదివాసి గ్రామాల ప్రజలను  ఇబ్బందులకు గురిచేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెంచులపై నమోదు చేసిన అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు . అటవీ ప్రాంతంలో నివాసపడిన ప్రతి చెంచుకుడానికి మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందించాలని, విద్య , వైద్యం సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. క్రమంలో పౌర హక్కుల సంఘం నాయకులు సత్యం, వెంకటేష్, తదితరులు ఉన్నారు.
Spread the love