Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పుట్ట మధువి బ్లాక్ మెయిల్ రాజకీయాలు

పుట్ట మధువి బ్లాక్ మెయిల్ రాజకీయాలు

- Advertisement -

ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు

బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంఛార్జి,మాజీ ఎమ్మెల్యే పుట్ట మదువి బ్లాక్ మెయిల్ రాజకీయాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దక్షిణ కాశీగా ఎంతో ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరంలోని కాళేశ్వర ముఖ్తేశ్వర స్వామి దేవాలయాన్ని రాబోవు రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మూడువేల మంది భక్తులు ఒకే సారి దర్శనం చేసుకునే విధంగా తీర్చిదిద్ధి అభివృద్ధి చేయడమే కాకుండా, అష్ట తీర్థాలను ఏర్పాటు చేసి, సరస్వతి ఘాట్ నుండి బ్రిడ్జి వరకు ఘాట్ల ఏర్పాటు, గోదావరి ఒడ్డున బ్రిడ్జి నుండి విఐపీ ఘాట్ వరకు రోడ్డు పనులకోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి రూ.198 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరు  చేయించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాబోవు తరాలకు కాళేశ్వర ముఖ్తేశ్వర ఆలయాన్ని, కాళేశ్వర గ్రామాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో అభివృద్ధి పనులు మొదలు పెడుతున్నారని చెప్పారు.

ఇంతటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేని పుట్ట మధు అసత్యపు ఆరోపణలు చేస్తూ భక్తులను, పురోహితులను, ప్రజలను, అయోమయానికి గురిచేస్తూ.. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పుట్ట మధు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం విడ్డురంగా ఉందన్నారు. గుప్త నిధుల కోసం పురాతన కట్టడాలను కూల్చే గుణం నీకు, మీ నాయకుడు కేసీఆర్ కు ఉందని గుర్తు చేశారు. తమ నాయకులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి అలాంటి బుద్ధి లేదని, మంథని నియోజకవర్గ అభివృద్దే వారి ధ్యేయమన్నారు. ఆలయాలపై దోచుకునే నీచ సంస్కృతి బిఆర్ఎస్ నాయకులదని, కాంగ్రెస్ నాయకులది కాదన్నారు.

తమ నాయకుడు శ్రీధర్ బాబు మంత్రిగా వివిధ దేశాలు తిరిగి రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చి సంపద సృష్టించారన్నారు. ప్రజల సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తే, బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ రాష్టాన్నీ రూ.8 లక్షల కోట్ల అప్పుల పాలు చేశాడని ఆరోపించారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేస్తున్న అభివృద్ధిని చూసి పుట్ట మధుకు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -