Friday, June 19, 2026
E-PAPER
Homeజాతీయంఉత్తరాఖండ్‌లో రోడ్డు ప్రమాదం..లోయపడిన వాహనం

ఉత్తరాఖండ్‌లో రోడ్డు ప్రమాదం..లోయపడిన వాహనం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లోని చంపావత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బరకోట్ ప్రాంతంలో, బాప్రు-బంటోలి సమీపంలో ప్రమాదవశాత్తు ఓ వాహనం దాదాపు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఆ తర్వాత మంటలు వ్యాపించాయి.ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారని అధికారులు శుక్రవారం తెలిపారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న సబ్-ఇన్‌స్పెక్టర్ దుంగర్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, చంపావత్ SDRF బృందం, అవసరమైన సహాయక పరికరాలతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. లోయలో నుంచి బాధితులను వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. నీతు దేవి (31), అక్షిత (8), ఆరవ్ (5) గా గుర్తించిన అధికారులు. గాయపడిన వారిని సహాయక బృందం సురక్షితంగా బయటకు తీసి, చికిత్స కోసం ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజేంద్ర కుమార్ (47) – అంజెడ, డిడిహాట్ నివాసి, బల్దేవ్ కుమార్ (34) – నంకోడి, అంజెడ, డిడిహాట్ నివాసి మరణించారు. మృతుల మృతదేహాలను వెలికితీసి, తదుపరి చట్టపరమైన చర్యల కోసం జిల్లా పోలీసులకు అప్పగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -