Friday, June 19, 2026
E-PAPER
Homeజిల్లాలుఉప్పునుంతల ఎంఈఓగా జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి

ఉప్పునుంతల ఎంఈఓగా జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల నూతన మండల విద్యాధికారిగా (ఎంఈఓ) పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజస్వ ప్రధానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం అదనపు బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయంతో విద్యాశాఖను ప్రగతి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మండలంలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు మేడిపూర్ మల్లికార్జున్, రామస్వామి, వెంకటేష్, శ్యాంసుందర్ గౌడ్, పోకల సతీష్, అజ్మతుల్లా, శ్రీనివాసులు, రాములు నాయక్, జగదీశ్వర్, శ్రీధర్, శంకర్, విష్ణుమూర్తి, రాజవర్ధన్ రెడ్డి, మీసాల మల్లికార్జున్, రాజేష్, లక్ష్మణ్, చందు నాయక్, వెంకటయ్య, గోపి, చంద్రశేఖర్, రాజు తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సన్మానించారు.

అలాగే మండల వనరుల కేంద్రం (ఎంఆర్సీ) సిబ్బంది, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో ఉప్పునుంతల మండల విద్యాశాఖ మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -