నవతెలంగాణ-కమ్మర్ పల్లి
కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ విద్యాసాయి పాఠశాలలో శుక్రవారం ఎస్ఐ సతీష్ మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటివల్ల కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు వివరించారు.విద్యార్థి దశలో ఉన్న యువత మత్తు పదార్థాలకు, గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి సారించి, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని, ఇటువంటి వ్యసనాలు జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు.సమాజంలో మత్తు పదార్థాల రహిత వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, శ్రీ విద్యాసాయి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు గంగారెడ్డి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విధ్యార్థులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



