Friday, June 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బడిబాటతో విద్యకు బాటలు..

బడిబాటతో విద్యకు బాటలు..

- Advertisement -

పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
నవతెలంగాణ – జుక్కల్ 

జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ జుక్కల్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే  తోట లక్ష్మీకాంతరావు  మరియు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు  ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసి, విద్య ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  సీఈవో చందర్ నాయక్,  ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డి గారు, ఎంపిడిఓ శ్రీనివాస్, ఎమ్ఈవో తిరుపతయ్య, ఎస్సై మురళి, తదితరులు పాల్గొన్నారు.  విద్యార్థులే దేశ భవిష్యత్తు.. విద్యాభివృద్ధే సమాజ ప్రగతికి పునాది” అనే సందేశంతో బడిబాట కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.ఎంఈవో తిరుపతయ్య అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -