Monday, July 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు 

రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు 

- Advertisement -

రైతు వేదికలో విత్తనమేళ
నవతెలంగాణ-జక్రాన్ పల్లి 

జక్రంపల్లి మండలంలోని రైతు ముంగిట్లో నాణ్యమైన విత్తనాలు  జక్రంపల్లి రైతు వేదిక వద్ద విత్తనమేల కార్యక్రమం చేపట్టడం జరిగినదని మండల వ్యవసాయ అధికారి దేవిక తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి దేవిక మాట్లాడుతూ ఎల్ నీ నో పరిస్థితిలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తక్కువ నీటితో సాగు అయ్యే పంటలు అనగా కందులు, మినుములు, పెసలు కూరగాయలను రైతులకు ప్రోత్సహించే దిశగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విత్తనమేల జక్రాంపల్లి రైతు వేదిక వద్ద  27.07.2026 నుండి 29.07.2026 వరకు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. కావున రైతులందరూ కూడా ఈ విత్తనమేలని సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతన్నలు పాల్గొనడం జరిగినది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -