Monday, July 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం 

నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్ 
పట్టణంలోని మేరు సంఘం భవనంలో పట్టణ మేరు సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు, రాష్ట్ర మేరు కార్పొరేషన్ చైర్మన్ వెంకటరాజం  ముఖ్య అతిథులుగా  పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన అధ్యక్షుడు దీకొండ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కొట్టూరు వినోద్, కోశాధికారిగా కోడిచర్ల అరుణ్ లకు జిల్లా అధ్యక్షుడు హనుమంత్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడు దీకొండ లక్ష్మణ్ మాట్లాడుతూ మేరు సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. మేరు కులస్తులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -