బీజేపీపై రాహుల్‌ది అలుపెరగని పోరు

బీజేపీపై రాహుల్‌ది అలుపెరగని పోరు– తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి
వాయనాడ్‌ : రాహుల్‌ గాంధీ మళ్లీ వాయనాడ్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నదని సూచనప్రాయంగా తెలుస్తోంది. కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కెేపీసీసీ) రాజకీయ ప్రచార కార్యక్రమం (సమరాగ్ని) బహిరంగ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం అనుసరించిన నిరంకుశ, అవినీతిమయ విధానాలు… దేశవ్యాప్తంగా వామపక్ష భావజాలాన్ని కలుషితం చేశాయన్నారు. దేశాన్ని రక్షించడానికి రాహుల్‌ కంకణం కట్టుకున్నారని, అందుకే బీజేపీకి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్నారని తెలిపారు.. కేరళలో తన నియోజకవర్గం (వాయనాడ్‌) గురించి రాహుల్‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయి పోరుకు నాంది పలకబోతుందని చెప్పారు. కాంగ్రెస్‌ నాయకుడు సచిన్‌ పైలట్‌ మాట్లాడుతూ.. దేశ రాజకీయాలకు బీజేపీ వల్ల అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటున్నాయని వివరించారు. లౌకిక పార్టీలు ముందుకు రావాలని కోరారు. తమ ప్రాంతీయ విభేదాలను , సన్నిహిత శ్రేణులను సమన్వయపర్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదన్నారు. ”కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు జరిగే ఎన్నికలు కావు. ఫాసిజం నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి ఇది ఒక అస్తిత్వ యుద్ధం,” అని పైలట్‌ అన్నారు. దేశ రాజ్యాంగంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఎలాంటి పాత్ర లేదని ఆయన అన్నారు. దళితులకు, మైనారిటీలకు బీజేపీ వ్యతిరేకమని కాంగ్రెస్‌ నేత జిగేష్‌ మేవానీ అన్నారు. కార్యక్రమంలో కేరళ ఇన్‌చార్జీగా ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపా దాస్‌మున్షీ, ఎంపీ శశి థరూర్‌, యూడీఎఫ్‌ కన్వీనర్‌ ఎం.ఎం. హసన్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రమేష్‌ చెన్నితాల, కోడికున్నిల్‌ సురేష్‌ ,జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పాలోడు రవి తదితరులున్నారు.

Spread the love