ఘనంగా రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – చండూరు
మునుగోడు శాసనసభ సభ్యులు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  జన్మదిన సందర్భంగా మండలంలోని పడమడితాళ్ళ గ్రామంలో   కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. మునుగోడు నియోజకవర్గానికి  హార్నిశలుగా కృషి చేస్తున్న  రాజగోపాల్ రెడ్డికి వారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  మాజీ సర్పంచ్ మేకల వెంకన్న ,గ్రామశాఖ అధ్యక్షులు జిల్ల  శ్రీను ,సోషల్ మీడియా  కోర్డినేటర్ సోమ మల్లేష్ ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కార్తి లెనిన్, జక్కర్తి రవి జిల్ల నర్సింహ, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జక్కర్తి రాజు,  తది తరులు పాల్గొన్నారు.
Spread the love