శంకరపట్నంలో రాజీవ్ గాంధీ వర్ధంతి

నవతెలంగాణ – శంకరపట్నం
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గోపగాని బసవయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ వర్ధంతికి  ముఖ్య అతిథిగా టీపీసీసీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తగట్టు ఆలయ చైర్మన్ ఉప్పుగల్ల మల్లారెడ్డి, గాజుల శ్రీనివాస్,హిస్సమోద్దీన్, మొలంగూరి సదానందం,జంపయ్య,బండారి తిరుపతి,నేరెళ్ల సంతోష్,ఆరిఫ్,  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love