Thursday, July 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీజేపీ నేతల వీరంగం

బీజేపీ నేతల వీరంగం

- Advertisement -

గాంధీ భవన్ ముట్టడిలో కర్రలతో హల్‌‌చల్‌
రాళ్లు రువ్విన వైనం జర్నలిస్టులు, పోలీసులకు గాయాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర రాజధానిలో బీజేపీ కార్యకర్తలు వీరంగం వేశారు. కాంగ్రెస్‌ శ్రేణులతో వారు ఘర్షణకు దిగారు. దీంతో హైదరాబాద్‌‌లోని నాంపల్లిలో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ప్రధాని నివాసం వద్ద ధర్నా చేయటాన్ని తప్పుబడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌‌రావు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీ నేతలు అక్కడికి చేరుకోవటంతో ఉద్రిక పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులకు దిగటంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ముట్టడి కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, అది తోపులాటగా మారి చివరకు పరస్పర దాడులకు దారితీసింది. ఈ సంఘటనను కవర్ చేస్తున్న పలువురు మీడియా ప్రతినిధులు కూడా గాయాలపాలయ్యారు. ప్రవీణ్‌ అనే జర్నలిస్టు తలకు బలమైన గాయం కావడంతో వెంటనే సమీపంలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బీజేపీ, నేతలు, కార్యకర్తలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులకు కూడా గాయాలయ్యాయి. మహిళా పోలీసులకు సైతం గాయాలయ్యాయి. పరిస్థితి మరింత దిగజారకుండా అదనపు బలగాలను మోహరించిన అధికారులు… ఆ ప్రాంతం మొత్తాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. రాంచందర్ రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు వారిని గోషామహల్ స్టేషన్ కు తరలించారు. అరెస్టులను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము నిరసన వ్యక్తం చేస్తే అణచివేయటమేంటని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -