నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలోని క్రాంతి ఫర్టిలైజర్స్ దుకాణాన్ని సోమవారం పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల దుకాణంలోని స్టాక్ రిజిస్టర్లు, విక్రయ రికార్డులు, ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించారు. అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలు, రైతులకు సరఫరా పరిస్థితి, ప్రభుత్వ నిబంధనల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగినంత ఎరువుల నిల్వలు నిర్వహించాలని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఎరువుల విక్రయాలు చేపట్టాలని సంబంధిత నిర్వాహకులకు సూచించారు.ఈ తనిఖీలో ఆర్డీవోతో పాటు సహాయ వ్యవసాయ సంచాలకులు జాలిగపు అవినాష్ వర్మ, పరకాల మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ ఉన్నారు.
క్రాంతి ఫర్టిలైజర్స్‌లో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



