Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆర్డీఎస్‌‌ను తుంగభద్ర బోర్డులోకి తేవాలి

ఆర్డీఎస్‌‌ను తుంగభద్ర బోర్డులోకి తేవాలి

- Advertisement -

మాజీమంత్రి శ్రీనివాస్‌‌గౌడ్‌ డిమాండ్‌
కర్నాటక, ఏపీ ప్రభుత్వాలు నీటిని వాడుకుంటున్నా పట్టించుకోని 
తెలంగాణ ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాజోలిబండ డైవర్షన్‌ ‌స్కీం (ఆర్డీఎస్)ను కూడా తుంగభద్ర బోర్డులోకి తేవాలని మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్‌ ‌చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నాటక, ఏపీ ప్రభుత్వాలు నీటిని వాడుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని అడిగారు. ఒకటి, రెండు రోజుల్లో మంత్రి ఉత్తమ్‌‌ను కలిసి వినతిపత్రం అందిస్తామన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు కోసం కర్నాటక ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కొంత మంది చేసే కుట్రల వల్ల నీటి యుద్ధాలు వచ్చే పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఎన్ని నీళ్లు తీసుకెళ్తున్నారో లెక్కే లేదన్నారు. ఇప్పటికైనా పాలమూరు, కన్నెపల్లి పంపులను ఆన్ చేయాలని డిమాండ్‌ ‌చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను చూసి షాక్ అయ్యానని చెప్పారు. గతంలో ఒక ఉద్యోగి తప్పు చేశారని చెప్తే అతన్ని వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేశానని వివరించారు. రాష్ట్ర రైతాంగం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -