డాక్టర్ వైఎస్సార్ అండ్ డాక్టర్ కేవీపీ ఫౌండేషన్ వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశ వ్యవసాయ రంగం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, గ్రామీణ జీవనోపాధి రంగాలలో అందించిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ‘ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ కు డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి అవార్డు-2026ను ఇవ్వాలని డాక్టర్ వైఎస్సార్ అండ్ డాక్టర్ కేవీపీ ఫౌండేషన్ నిర్ణయించింది. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అవార్డు కింద రూ. 25 లక్షల నగదు బహుమతిని అందజేయనుంది. వచ్చేనెల 2న న్యూఢిల్లీలోని ‘కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా’లో నిర్వహించే కార్యక్రమంలో ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ తరఫున ఆ సంస్థ చైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ ఈ అవార్డును అందుకోనున్నారు.
2025లో ఈ ఫౌండేషన్ ప్రయాణం ప్రారంభమైంది. తొలి అవార్డును సుస్థిర, ప్రకృతి వ్యవసాయంలో విశేష కృషి చేసిన సుభాష్ పాలేకర్ కృషి (ఎస్పీకే) కి ప్రదానం చేసింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ తరుపున ఎస్పీకేకు రూ. 25 లక్షల నగదు అవార్డును స్వీకరించారు. అదే కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం, పరిశోధనలలో చేసిన కృషికి గాను శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్‌ను సత్కరించింది. ఈ సత్కారాన్ని ఫౌండేషన్ తరఫున డాక్టర్ చదలవాడ సుధ, డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు స్వీకరించారు. 2026లో, ‘ఫౌండేషన్’ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూ. 21 లక్షలతో నిధిని ( స్కాలర్‌షిప్) ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి స్కాలర్‌షిప్ అందజేస్తారు. వీటితో పాటు సమాజ సంక్షేమానికి కట్టుబడి సేవ చేస్తున్న పలువురు వ్యక్తులకు, సామాజిక కార్యక్రమాలు చేపట్టే సంస్థలకు కూడా ఫౌండేషన్ మద్దతుగా నిలుస్తోంది. ఈ సంస్ధకు ట్రస్టీలుగా మాజీఎంపీ డాక్టర్ కేవీపీ రామచందర్ రావు, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి, సీడబ్య్లూసీ సభ్యులు డాక్టర్ ఎన్. రఘువీరారెడ్డి ఉన్నారు.
ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు వైఎస్‌ఆర్ అవార్డు-2026
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



