Wednesday, August 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపంటల మార్పిడిపై ప్రజలను చైతన్యం చేయాలి

పంటల మార్పిడిపై ప్రజలను చైతన్యం చేయాలి

- Advertisement -

వీడియోకాన్ఫరెన్స్‌‌లో సీఎస్‌ సంజయ్‌‌జాజు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో పంట మార్పిడి విధానాలపై రైతులను మరింత చైతన్యం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.వ్యవసాయసాగుకు అనుసరించాల్సిన నూతన విధానాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల వారీగా సీజనల్ పరిస్థితులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలపై సీఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. అంచనా వేయబడుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రత్యామ్నాయ పంటల (కాంటింజెన్సీ క్రాప్) ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. పంటల వైవిధ్యీకరణ (క్రాప్ డైవర్సిఫికేషన్) అవసరాన్ని చెబుతూ, తక్కువ నీటి అవసరం ఉండే, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన పంటలను సాగు చేసేలా రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. పంటల వైవిధ్యీకరణ వ్యూహంలో భాగంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిం చేందుకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులను సిఎస్ ఆదేశించారు.

నీట్‌ ‌పీజీ ప్రవేశ పరీక్ష సన్నాహాలపై
ఈ నెల 30వ తేదీన జరగనున్న నీట్‌ ‌పీజీ ప్రవేశ పరీక్ష సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు జిల్లాల్లో చేసిన ఏర్పాట్లను సీఎస్ సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, విద్యుత్, తాగునీరు, రవాణా తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేసి పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. హైదరాబాద్, మేడ్చల్ –మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 30 సెంటర్లలో ఈ పరీక్ష జరగనున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు, నిరంతర విద్యుత్ సరఫరా, తదితర మౌలిక సదుపాయాలను కల్పిం చాలని కలెక్టర్లను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టా త్మకంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా జరిగేందుకు తగిన చర్యలు తీసు కోవాలని కలెక్టర్లను ఆదేశించారు.

పర్యాటకాభివృద్ధి కోసం..
తెలంగాణ టూరిజం 2047 పాలసీలో భాగంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. ప్రతి జిల్లాలో ఉన్న ముఖ్య మైన పర్యాటక ప్రాంతాలను గుర్తించి, అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పరిశుభ్రత, సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచిం చారు. జిల్లాల ప్రత్యేకతలు, చారిత్రక, సాంస్కృతిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కి 27 స్పెషల్ టూరిజం ప్రదేశాలు(ఎస్ టిఎ)లను గుర్తించిందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా చొంగ్తూ, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పోలీస్ శాఖ డిజి మహేశ్ భగవత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -