36 మంది మృతి.. 163మందికి గాయాలు
కరాచీ : పాకిస్తా న్-అఫ్గానిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో పాక్ భద్రతా దళాలు ఆదివారం భారీ సైనిక చర్య చేపట్టాయి. భూ ఆపరేషన్‌తో పాటు ఉగ్రవాదుల స్థావరాలు, సురక్షిత కేంద్రాలపై లక్ష్యిత దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. 163 మంది గాయపడినట్లు తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. మూడు నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొంది. పాకిస్థాన్లో ఇటీవల జరిగిన వరుస ఉగ్రదాడులకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. తాజా చర్యతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవలి సంవత్సరాల్లో పాకిస్థాన్‌లో పోలీసు, భద్రతా దళాలపై ఉగ్రదాడులు గణనీయంగా పెరిగాయి. ఈ దాడుల వెనుక తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ), దాని అనుబంధ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. తాజా ఆపరేషన్‌కు ఒక రోజు ముందు కరాచీలోని పారా మిలటరీ రేంజర్స్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై తుపాకులు, పేలుడు పదార్థాలతో దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మరణించారు. ప్రతిగా భద్రతా బలగాలు ముగ్గురు దుండగులను హతమార్చి, మరో వ్యక్తిని గాయపడిన స్థితిలో అరెస్టు చేశాయి. అతడు అఫ్గాన్ పౌరుడని పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. ఈ దాడికి టీటీపీ నుంచి విడిపోయిన జమాత్-ఉల్-అహ్రార్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించినట్లు ప్రకటించింది.
తాలిబాన్ స్థావరాలే లక్ష్యం
దాడి అనంతరం ప్రత్యేక భద్రతా దళాలు, ఉగ్రవాద వ్యతిరేక బృందాలు, రేంజర్స్ సిబ్బంది ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదులు ఎవరైనా ఇంకా దాక్కుని ఉన్నారేమోనన్న అనుమానంతో ‘మాపింగ్-అప్’ ఆపరేషన్ కొనసాగించినట్లు అధికారులు తెలిపారు. అఫ్గాన్ సరిహద్దులో జరిగిన తాజా సైనిక చర్య పాకిస్థాన్ తాలిబాన్‌కు చెందిన స్థావరాలు, ఆశ్రయ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని చేపట్టినట్లు సమాచార శాఖ మంత్రి మంత్రి అత్తౌల్లా తరార్ తెలిపారు.
అఫ్గాన్ సరిహద్దులో ఆగని పాక్ దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



