బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న దంపతుల రిమాండ్

నవతెలంగాణ – రామారెడ్డి
 బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న దంపతులపై కేసు నమోదు చేసి సోమవారం పోలీసులు రిమాండ్ కు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రెడ్డి పేట గ్రామానికి చెందిన గడీల బైరయ్య, ఓ పత్రికలో పనిచేస్తూ, కుటుంబాన్ని పోషించటానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కవడంతో, సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో భార్య భాగ్యలక్ష్మి తో కలిసి కామారెడ్డి ప్రాంతంలో ఒంటరి మహిళలకు  మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని, మండలంలోని ఫకీరా తాండాకు చెందిన మహిళను గమనించి, భర్త చనిపోయాడని, మీకు రూ.40000 వస్తాయని నమ్మబలికి ఆమె నుండి బలవంతంగా రూ. 6000 తీసుకొని కామారెడ్డి బయలుదేరారని, జగదాంబ తండా కు చెందిన భూక్య బూలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు జరుపుతూ, రామారెడ్డి లో ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా, పోలీసులను చూసి బైరయ్య, అతని భార్య భాగ్యలక్ష్మి పారిపోతుండగా పట్టుకొని విచారించగా, నిజాన్ని ఒప్పుకోగ, కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు  పంపినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, అక్రమ వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎవరైనా బెదిరింపులకు, భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా వసూలు చేస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.
Spread the love