గోకుల్ తండాలో జయశంకర్ బడిబాట

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని గోకుల్ తండాలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతి మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలలో నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధనతోపాటు ఉచిత రెండు జతలు దుస్తులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం అందజేస్తుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఇంటింటికి తిరుగుతూ సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సక్కుబాయి, యాదయ్య, బాల నర్సు, సి ఆర్ పి మహమ్మద్, అంగన్వాడి టీచర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love