మేడారంలో ముమ్మరంగా విద్యుత్ లైన్ మరమ్మతులు

నవతెలంగాణ- తాడ్వాయి
మేడారంలో నిరంతర విద్యుత్ సేవలందించడంలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు మిగతా శాఖల అధికారుల కంటే ముందస్తుగా పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఎన్పీడీసీఎల్ ఎస్సీ భూపాలపల్లి బి మల్సూర్ నాయక్, ఆధ్వర్యంలో ఎన్పీడీసీఎల్ డిఇ పులుసుం నాగేశ్వరరావు పర్యవేక్షణలో 33 కెవి పస్రా నుండి మేడారం వరకు గల విద్యుత్ లైన్ ను ముమ్మరంగా మరమ్మతులు నిర్వహించారు. పస్రా నుండి మేడారం వరకు గల విద్యుత్తు లైన్ లో ప్రతి కరెంటు పోల్ ఎక్కి చెక్ చేస్తున్నారు. 33 కెవి పిన్ ఇన్సులేటర్స్ చెక్ చేసి డ్యామేజీ ఉన్న వాటిని తొలగించి, కొత్త వాటిని ఏర్పాటు చేశారు. కొన్ని ఏరియాలో విద్యుత్ లైన్ లకు చెట్లు కొమ్మలు తగులుతున్న సందర్భంగా కొమ్మలను కొట్టి లైన్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మేడారం వనదేవతల జాతర్లకు మెరుగైన నిరంతర విద్యుత్ అందించడంలో విద్యుత్ శాఖ ముందంజలో ఉన్నామని తెలిపారు. వన దేవతల సన్నిధిలో సేవలందించడం ఎంతో ఆహ్లాదంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 20 మంది ఇంజనీర్లు, డి ఈ, ఏఈ, సబ్ ఇంజనీర్ లు, 44 మంది విద్యుత్ సిబ్బంది, అన్ మాండ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love