
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు దనసరి అనసూర్య (సీతక్క) బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా గురువారం మండలం నుండి మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెల్లి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గోవిందరావుపేట మండలమునకు చెందిన నాయకుడు కావడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో అనేక వాహనాలను కార్యకర్తలు తరలి వెళ్లారు. మహిళా కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో ధరణి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి డాక్టర్ సీతక్క కూడా సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చిన తన నియోజకవర్గం ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులూ కూడా మండలం నుండి తరలి సీతక్కకు శుభాకాంక్షలు తెలిపారు.