Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉచిత కంటి వైద్య శిబిరంకు స్పందన 

ఉచిత కంటి వైద్య శిబిరంకు స్పందన 

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
మండల కేంద్రంలోని అంకోల్ తండాలో బురువారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అంధత్వ రహిత సమాజమే లక్ష్యంగా మండలంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని  జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ బోధన్ లయన్స్ క్లబ్ వారి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ శిబిరం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం వరకు కొనసాగింది. శిబిరంలో అత్యాధునిక కంప్యూటర్ యంత్రాల ద్వారా రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ ఎండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ.. మారుమూల తండాలలో ఇలాంటి ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహించి అందరికీ వైద్యం అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి కంటి వైద్య శిబిరాలను మరెన్నో గ్రామాలలో నిర్వహిస్తామని తెలిపారు . అలాగే కంటి వైద్యుడు అజయ్ మాట్లాడుతూ దాదాపుగా 180 మందికి వైద్య పరీక్షలు చేయించుకోగా అందులో 17 మందికి మోతి బిందు ఆపరేషన్లు అవసరమని తెలిపారు. వారికి బోధన్ లయాన్స్ క్లబ్ ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్ చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ డైరెక్టర్ హన్మంత్ రావ్, తండా ఉపసర్పంచ్ శ్రీచంద్, మరియు తండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -