నవతెలంగాణ – కామారెడ్డి : తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక “99 రోజుల కార్యాచరణ ప్రణాళిక – యువజన వారోత్సవాలు”లో భాగంగా జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యువజన, క్రీడల అధికారి (డీవైఎస్‌వో) రంగ వెంకటేశ్వర్ గౌడ్ హాజరై క్రీడాకారులను ఉత్సాహపరిచారు. జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు యోగా రాంరెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. జనగామ రోహిత్ రెడ్డి స్వర్ణ పతకం సాధించి ప్రత్యేక ప్రతిభ కనబరిచారు. విజేతలకు పతకాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, యువత క్రీడలను జీవితంలో భాగంగా చేసుకుని శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పతక విజేతలందరికీ అభినందనలు తెలిపారు.
స్పోర్ట్స్ డేలో స్వర్ణం సాధించిన జనగామ రోహిన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



