Thursday, August 6, 2026
E-PAPER
Homeఖమ్మంపొంగులేటి ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ

పొంగులేటి ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ

- Advertisement -

పొంగులేటి రాఘవరెడ్డి- స్వరాజ్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.25 వేల విలువైన విద్యా సామగ్రి పంపిణీ
నవతెలంగాణ – సత్తుపల్లి

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వెంగళరావునగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ‘పొంగులేటి రాఘవరెడ్డి – స్వరాజ్యం చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో సుమారు రూ. 25 వేల విలువైన విద్యా సామగ్రి స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, నోట్‌బుక్స్, పెన్నులు తదితర వస్తువులను గురువారం అందజేశారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి నక్కా రాజేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని, పిల్లలను ఇంటి వద్ద రోజూ చదివించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంఈఓ రాజేశ్వరరావు కోరారు. ఇటీవల పాఠశాలకు డెస్క్ బెంచీలను ఏర్పాటు చేసిన  ఎంఈఓ రాజేశ్వరరావును విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదనరావు, ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, ఏఏపీసీ చైర్మన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -