– జనసేన కామారెడ్డి జిల్లా నాయకుడు కంచర్ల నర్సాగౌడ్ (చిరంజీవి)
నవతెలంగాణ – కామారెడ్డి
జనసేన పార్టీ జహీరాబాద్ పార్లమెంట్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఉమ్మడి సమావేశం ఈ నెల 8న నిజామాబాద్‌లో నిర్వహించనున్నట్లు జనసేన కామారెడ్డి జిల్లా నాయకుడు కంచర్ల నర్సాగౌడ్ (చిరంజీవి) తెలిపారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం నిజామాబాద్ నగరంలోని హైదరాబాద్ రోడ్డులో, ఈనాడు కార్యాలయం పక్కన ఉన్న సుగుణ గార్డెన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆయన కోరారు.
జనసేన సమావేశాన్ని విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -



