Friday, September 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలునవతెలంగాణ కథనానికి స్పందన..12 గంటల్లో రైతు సమస్య పరిష్కారం

నవతెలంగాణ కథనానికి స్పందన..12 గంటల్లో రైతు సమస్య పరిష్కారం

- Advertisement -

– కలెక్టర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఆదేశాలతో వెంటనే చర్యలు
నవతెలంగాణ – ఉప్పునుంతల
: నిబంధనలు బేఖాతర్.. లైన్‌మెన్ నిర్లక్ష్యమా? ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమా? అనే శీర్షికతో రైతు సమస్యపై నవతెలంగాణ గురువారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఉప్పునుంతల మండల గ్రామ శివారులోని సర్వే నంబర్ 168 లో, కంసానిపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు చింతల సాయిలమ్మకు చెందిన 2.20 ఎకరాల పొలంలో నాలుగు నెలల క్రితం ఈదురు గాలులకు వ్యవసాయ విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. మరమ్మతులు చేపట్టకపోవడంతో సాగు చేసుకోలేక రైతు కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కథనంలో పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) స్పందించి చర్యలకు ఆదేశించారు. మండల ఏఈ అప్పలనాయుడు విద్యుత్ సిబ్బందితో కలిసి 12 గంటల వ్యవధిలోనే కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి, విద్యుత్ వైర్ల కనెక్షన్‌ను పునరుద్ధరించారు. సమస్య త్వరితగతిన పరిష్కారం కావడంతో రైతు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కారానికి దోహదపడిన నవతెలంగాణకు విద్యుత్ శాఖ ఏఈ, రైతు కుటుంబం అభినందనలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -