Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పని సరి : ప్రేమ్ కరణ్ రెడ్డి

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పని సరి : ప్రేమ్ కరణ్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – కట్టంగూర్ : ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తప్పని సరి అని జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అభినందన సన్మాన సభ శుక్రవారం కట్టంగూర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.అంకితభావంతో పని చేస్తే ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. జ్ఞాన ప్రకాశ్ రావు ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మంచి అధికాలగా గుర్తింపు పొందారని కొనియాడారు.

అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు జ్ఞానప్రకాశ్ రావు ను శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీపీఓ శంకర్ నాయక్, ఎంపీడీఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భూక్యా యాకూబ్ నాయక్, మాజీ జడ్పీటీసీ మాద యాదగిరి, సూపరిండిండెంట్ చింతమల్ల చలపతి, ఏపీఓ కడెం రాంమోహన్, ఏఓ గిరి ప్రసాద్, సర్పంచ్ లు, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -