– గౌలిదొడ్డి గురుకుల ప్రిన్సిపాల్ పాపారావ్
నవతెలంగాణ-గండిపేట్
ఆల్ ఇండియా సివిల్స్‌ల్లో 410 ర్యాంక్ సాధించడం గొప్ప విషయని గౌలిదొడ్డి బాలురు గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ పాపారావ్ అన్నారు. బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌలిదొడ్డి బాలుర గురుకులంల్లో ఇంటర్మియట్ చదివిన పేదింటి విద్యార్థి డోంగ్రే రేవయ్య సివిల్స్‌ల్లో ఆల్ ఇండియా స్థాయిల్లో 410 ర్యాంక్ సాదించినట్టు తెలిపారు. గురుకులం నుండి చదువుకున్న రేవయ్య మాద్రాస్‌ల్లో ఐఐటీల్లో సీటు సాధించినట్టు తెలిపారు. సివిల్స్‌ల్లో మంచి ర్యాంక్ సాధించిన అతడిని రంగారెడ్డి గురుకులాల కో ఆర్డినేటర్ డాక్టర్ శారదావేంకటేష్, గౌలిదొడ్డి ఉపాధ్యాయులు అభినందించినట్టు తెలిపారు. రేవయ్య పదొతరగతి వరకు ఆసీఫాబాద్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, ఇంటర్ గౌలిదొడ్డి గురుకుల కళాశాల్లో చదువుకున్నట్లు తెలిపారు. చదువుల్లో ముందుండే రేవయ్య 2012లో మద్రాసు ఐఐటీల్లో సీటు సంపాధించినట్లు తెలిపారు. 2017ల్లో ఆల్ ఇండియా గేట్ టాఫర్‌గా నిలిచినట్లు తెలిపారు. ఎక్సిక్యూటివ్ ఇంజనీర్‌గా నేషనల్ గాస్ కార్పొరేషన్‌ల్లో ఉద్యోగం పొందినట్లు తెలిపారు. కడు పేదరికంలో నుండి వచ్చి తండ్రి లేకపోయిన తల్లి ప్రోత్సహాంతో కష్టపడి ఎందరో విద్యార్థులకు ఆదర్శ నిలిచారని ఆభినందించారు. గురుకులల్లో విద్యనందుకుంటున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అదర్శ మార్గంలో మంచి భవిష్యత్‌ను అందించే దిశల్లో నడవాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రేవయ్యకు ప్రత్యేకంగా అభినందినలు తెలిపారు.